గుడ్ న్యూస్ : హైదరాబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్




హైదరాబాద్ కు కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. పూణే నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వ్యాక్సిన్ ను ప్రత్యేక కంటైనర్ లలో కోఠీలోలోని కరోనా వ్యాక్సిన్ నిలువ కేంద్రానికి తరలించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పంపిణీ కోసం 6.5 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లను పుణే నుంచి పంపించారు. వ్యాక్సిన్ లను నిలువ ఉంచేందుకు కోఠీలో అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ ల నిలువ కోసం  44 క్యూబిక్ మీటర్ల  ప్రత్యేక ఫ్రీజర్లను తయారు చేయించారు.

కాగా పుణేలోని తమ పరిశ్రమలో  సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఈ రోజు దేశంలో పలు రాష్ట్రాలకు పంపిణీ చేశారు. ప్రత్యేక ట్రక్కుల్లో ఏయిర్ పోర్టుకు పంపి అక్కడి నుండి ప్రత్యేక విమానాల్లో అన్ని రాష్ట్రాలకు బయలు దేరాయి. ముందుగా ఈ రోజు హైదరాబాద్, విజయవాడ‌లతో సహా ఢిల్లీ, కోల్ కతా, గువాహటి, బెంగళూరు, చెన్నై, చండీ గడ్, అహ్మదాబాద్, లక్నో, భువనేశ్వర్ లకు వ్యాక్సిన్ పంపిస్తున్నారు. ఇందు కోసం 2 కార్గో విమానాలు, 8 కమర్షియల్ విమానాలను వినియోగిస్తున్నారు. 


Latest News
more

Trending
more