ప్రజలకిచ్చిన హామిలను నేరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి




ప్రజలకిచ్చిన హామిలను నేరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అక్షర విజేత, మోర్తాడ్ : అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా వంద రోజులలోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, మోర్తాడ్ గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పల అశోక్ పేర్కొన్నారు. గురువారం మోర్తాడ్ మండలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లుల మాఫీ పథకం అమలు కావడం పట్ల ప్రజలు వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం మాదిరిగా ఓట్ల కోసమే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినట్లుగా కాకుండా, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీసంక్షేమ పథకాలను, ముందుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ రవాణా సౌకర్యం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, ప్రస్తుతం 200 యూనిట్ల ఉత్త విద్యుత్ మాపి అమలు చేసి చూపించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే సాధ్యమైంది అన్నారు. ఈనెల 12న ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు, ఇల్లా నిర్మాణాలకు రుణాల మంజూరు పథకం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే, మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేయడమే కాకుండా, రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి నిలుపుతారని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మోర్తాడ్ మండల ప్రజల తరఫున సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కం అశోక్, శ్రీధర్, ఎండి నశీర్, భూషణ్ , అశోక్, నీరాజ్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్కొన్నారు.
 


Latest News
more

Trending
more