రైతులు, కే‍ంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు మళ్ళీ విఫలం !





కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య ఈ రోజు జరిగిన 7వ విడత చర్చలు విఫలమయ్యాయి. మళ్ళీ జనవరి 8వ తేదీన చర్చలు జరుగుతాయి.  కేంద్రం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో 39 రోజులుగా రైతులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. ఈ రోజు ఉదయం ఢిల్లీ విఙాన్ భవన్ లో ప్రారంభమైన సమావేశంలో  40 రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే, వాణిజ్య, ఆహార మంత్రి పియూష్ గోయల్ మరియు పంజాబ్ నుండి ఎంపిగా ఉన్న రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి సోమ్ ప్రకాష్ ఉన్నారు. అయితే  గత ఆరువిడతల సమావేశాలమాదిరిగానే  మాదిరిగానే ఈ సమావేశం కూడా సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. చట్టాలను రద్దు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదన్న తన పాత వాదనకే ప్రభుత్వం కట్టుబడి ఉండగా చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతు సంఘాలు పట్టుదలగా ఉన్నాయి. 

భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల ప్రతినిధులు తమ సొంత ఆహారాన్నిప్రతిసారి లాగానే  లాంగర్ (కమ్యూనిటీ కిచెన్) నుండి తెచ్చుకున్నారు. గత సారి రైతులతో కలిసి భోజనం చేసిన  మంత్రులు ఈ సారి ప్రత్యేకంగా భోజనం చేశారు. భోజన విరామ సమయంలో రెండు వర్గాలు విడివిడిగా తమలో తాము దాదాపు గంట పాటు చర్చలు జరుపుకున్నారు.

ఈ రోజు జరిగిన సమావేశం తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ''ఈ రోజు సమావేశంలో  ఎలాంటి పరిష్కారానికి రాలేకపోయాం. వ్యవసాయ చట్టాల రద్దుపై రైతులు పట్టుదలతో ఉన్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో కొంత ఏకాభిప్రాయం కుదిరిందనే అనుకుంటున్నాం. తర్వాతి జరిగే సమావేశంలో పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

కాగా ''ఈరోజు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతీ లేదని  రైతు సంఘాలు ప్రకటించాయి. ''మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం, పంటకు  కనీస మద్దతు ధర కల్పించడం అనే మాడిమాండ్ల నుండి వెనక్కి తగ్గేది లేదు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోనంత వరకు మేము ఇంటికి వెళ్లేది లేదు’’ అని భారతీయ కిసాన్ యూనియర్ నేత రాకేష్ తికైత్ అన్నారు. ‘‘ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. మా డిమాండ్లను ఒప్పుకోవడం మినహా ప్రభుత్వానికి వేరే దారి లేదు. వ్యవసాయ చట్టాల రద్దు మినహా ప్రభుత్వం మరేం చెప్పినా వినేది లేదు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు నిరసన చేపడతాం’’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ జనరల్ సెక్రెటరీ హన్నాన్ మొల్లాహ్ అన్నారు.

అయితే ఈ రోజు జరిగే చర్చలు విఫలమైతే  దేశవ్యాప్తంగా మాల్స్, పెట్రోల్ పంపులను మూసివేయడం ద్వారా తమ నిరసనను ముమ్మరం చేస్తామని రైతులు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. 


Latest News
more

Trending
more