జైల్లో ఉన్న అఖిల ప్రియ గర్భవతి....బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ‌




కేసీఆర్ బంధువులు ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావుల  కిడ్నాప్‌ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి  భూమా అఖిల ప్రియ ప్రస్తుతం గర్భిణి. ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ త్వరగానే వస్తుందని ఆమె అనుచరులు నమ్మకంగా ఉన్నారు.ఆమెను కేసులో అన్యాయంగా ఇరికించారని అఖిల ప్రియ కుటుంబ సభ్యులు, అనుచరులు వాదిస్తున్నారు.  ఆమె తరపు న్యాయవాదులు నిన్ననే  కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.అయితే కేసు చాలా బలంగా ఉందని వెంటనే బెయిల్ రావడం కష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

మరో వైపు కిడ్నాప్ కేసులో మరో నిందితుడు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఆయన కోసం పోలీసుబృందాలు గాలిస్తున్నాయి. ఆయన ఆచూకి కోసం పోలీసులు అఖిలప్రియను ప్రశ్నించినప్పటికీ తనకేమీ తెలియదని ఆమె సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. 

కాగా రెండు వైపులా రాజకీయంగా బలమైన వర్గాలు ఉండటం, వారు రెండు రాష్ట్రాలకుచెందినవారు కావడంతో రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ కేసు ఉత్కంట పెంచుతోంది. 


Latest News
more

Trending
more