ఢిల్లీలో ఏపీ గవర్నర్ బిజీబిజీ.. ముగిసిన ఐదు రోజుల పర్యటన..!




ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. సోమవారం (ఏప్రిల్ 25) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బిజీబిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ భవన్‌ను సందర్శించే పలువురు వీఐపీలను ఆయన కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను గవర్నర్ కలిశారు. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి, గవర్నర్ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. గవర్నర్ వెంట గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉన్నారు.

ఢిల్లీ పర్యటనలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పలు అంశాలపై అక్కడి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో కూడా ఏపీ గవర్నర్ భేటీ అయ్యారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై మోదీతో ఆయన చర్చించారు. అలాగే రాష్ట్రపతితోనూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు.

అంతకుముందు ఢిల్లీ పర్యటనలో ముందుగా ఏపీ గవర్నర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఇతర కేంద్ర మంత్రులైన రాజ్ నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్‌తో బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. పర్యటనలో భాగంగా నేషనల్ వార్ మెమోరియల్‌ను గవర్నర్‌ సందర్శించారు.  సోమవారంతో ఏపీ గవర్నర్ ఐదు రోజుల పర్యటన ముగిసింది. ఆయన తిరిగి ఏపీకి తిరుగు పయనం కానున్నారు.

ఇటీవలే, తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఇద్దరూ ఢిల్లీలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏపీ గవర్నర్ పర్యటనకు సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత లేదని, కేవలం ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హరిచందన్ మంగళవారం విజయవాడకు తిరిగి రానున్నారు.


Latest News
more

Trending
more