సిడ్నీ టెస్టు : తుది జట్టు ప్రకటించిన బీసీసీఐ




బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన మూడో టెస్టు గురువారం నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన విజయాన్ని అందుకున్న టీమ్ ఇండియా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఇరు జట్లకు మూడో టెస్టు కీలకంగా మారనుంది. సిరీస్ విజయాన్ని ఈ టెస్టు నిర్దేశించనున్నది. దీంతో జట్టు కూర్పును అన్ని రకాలుగా ఆలోచించి రూపొందించారు. తుది జట్టు వివరాలను బీసీసీఐ బుధవారం వెల్లడించింది.

తొలి టెస్టులో పృథ్వీషా విఫలం కావడంతో శుభమన్ గిల్‌కు చోటిచ్చారు. ఇక రెండో టెస్టులు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పూర్తిగా విఫలమవగా.. శుభమన్ గిల్ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని అద్బుతంగా వినియోగించుకున్నాడు. గాయం నుంచి కోలుకొని ఆస్ట్రేలియా వెళ్లిన రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్ పదవి కట్టబెట్టడమే కాకుండా.. అతడిని తుది జట్టులోకి తీసుకున్నారు. మయాంక్ అగర్వాల్‌పై వేటు వేసి రోహిత్ శర్మను జట్టులో చేర్చారు. టెస్టు జట్టులోకి టి. నటరాజన్‌ను తీసుకున్నా.. అతడికి తుది జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. గాయపడిన ఉమేష్ యాదవ్ స్థానంలో నవదీప్ సైనీకి తుది జట్టులో స్థానం దక్కింది. అతడికి ఇదే తొలి టెస్టు కావడం గమనార్హం.

టీమ్ ఇండియా తుది జట్టు

అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, చతేశ్వర్ పుజార, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీన్ సైనీ


Latest News
more

Trending
more