రిపబ్లిక్ డే రైతు ర్యాలీ కోసం ట్రాక్టర్లు నడపడం నేర్చుకుంటున్న మహిళా రైతులు




కేంద్రం తీసుకవచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో రైతులు చేస్తున్న పోరాటం మరింత‌ ఉదృతం చేసెందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్త వివిధ‌ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని సంకల్పించాయి. ఈ ట్రాక్టర్ ర్యాలీలో  పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున మహిళలు సిద్దమవుతున్నారు. మరో వైపు ఈ ర్యాలీలో ట్రాక్టర్లను నడిపే విధంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు రైతు నాయకులు. 

500 మందికి పైగా మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తోంది  భారతీయ కిసాన్ యూనియన్. హర్యాణా లోని జింద్ జిల్లాలో సాగుతున్న ఈ శిక్షణకు సంబంధించి ట్రైనర్ మాట్లాడుతూ...

"ఈ స్త్రీలలో చాలామందికి  ట్రాక్టర్ నడపడం ఇప్పటికే ఎంతో కొంత వచ్చు. అయితే నేషనల్ హైవేలపై నడపడం కోసం వీరికి శిక్షణ ఇస్తున్నాం. అందుకు వీరికున్న నైపుణ్యాలను మరింత పదునుపెడుతున్నాం'' అన్నారు. 


సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రిపబ్లిక్ డే నాడు ఊరేగింపులో పాల్గొనడానికి జింద్ జిల్లా నుండి ఢిల్లీకి దాదాపు 20 వేల మందిని తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు జింద్ జిల్లాకు చెందిన బికెయు నాయకుడు రామ్‌రాజీ ధుల్ తెలిపారు.

"మహిళలు నడిపే ట్రాక్టర్లు, మహిళా కార్యకర్తల కవాతు ర్యాలీకి ముందు వరుసలో ఉంటాయి" అని ఆయన అన్నారు.

“కొంతమంది మహిళలు పొలం దున్నడం వంటి వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడానికి పొలాలలో ట్రాక్టర్ నడిపినవాళ్ళె. కానీ వారు హైవే రోడ్లపై ఇప్పటి వరకు డ్రైవింగ్ చేయలేదు.   అందుకే వీళ్ళకు  శిక్షణ ఇవ్వడానికి మేము అనుబవఙులైన‌ డ్రైవర్లను ఏర్పాటు చేశాము. మహిళలు చాలా త్వరగా నేర్చుకుంటున్నారు. ”అని ఆయన అన్నారు.

https://www.youtube.com/watch?v=lJfcB2Anlkc

 


Latest News
more

Trending
more