పోర్న్‌స్టార్‌గా మారిన ఫుట్‌బాల్ ప్లేయర్




కరోనా అందరి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఎంతో మంది రోడ్డున పడ్డారు. కూలీలు, కార్మికులకు పనుల్లేక స్వగ్రామాలకు వెళ్లిపోయారు. కరోనా అన్ని రంగాల్లోని వ్యక్తులపై తీవ్రంగా ప్రభావం చూపించింది. క్రీడారంగం కూడా దాదాపు 6 నెలల పాటు మూతబడిపోయింది. ఎంతో మంది క్రీడాకారులు కనీసం సాధన కూడా  చేయలేక ఇంటిపట్టునే ఉండిపోయారు. ఈ క్రమంలో కొంత మంది ప్రొఫెషనల్ క్రీడాకారులు జీతాలు, మ్యాచ్ ఫీజులు రాక ఇబ్బందులు పడ్డారు. అలా ఆర్దికంగా ఇబ్బంది పడిన ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి ఏకంగా పోర్న్‌స్టార్ అవతారం ఎత్తింది. డబ్బుకోసమే ఇలా మారినట్లు ఆమె స్వయంగా ప్రకటించింది.

ఇంగ్లాండ్‌లోని చార్ల్‌టన్ అథ్లెటిక్ సాకర్ క్లబ్‌కు చెందిన మెడెలీన్ రైట్ (22) ప్రస్తుతం పోర్న్ ఇండస్ట్రీలో ఉపాధిని వెతుక్కుంది. వాస్తవానికి ఆమె కావాలని ఈ ఉపాధిని ఎంచుకోలేదు. గత ఏడాది స్నాప్‌చాట్‌లో తన అశ్లీల వీడియోలు షేర్ చేసింది. తన వీడియోలు డబ్బులు చెల్లించి చూడొచ్చని పేర్కొంది. దీనిపై సదరు క్లబ్ ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెపై నిషేధం విధించింది. దీంతో ఆమె పోర్న్‌నే తన వృత్తిగా స్వీకరించింది. అభిమానులు తన వీడియోలు, ఫొటోలు 33 డాలర్లు చెల్లించి చూడవచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నది. కరోనా కారణంగానే డబ్బు కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నట్లు తెలిపింది.

కాగా, గతంలో రేసర్ రేనీ గ్రేసియా, టెన్నిస్ క్రీడాకారిణి గ్రావోక్ కూడా తమ క్రీడా కెరీర్‌ను పక్కకు పెట్టి పోర్న్ స్టార్‌లుగా మారారు. అందుకే మెడెలీన్ రైట్ కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది.


Latest News
more

Trending
more