ఉద్రిక్తంగా మారిన రామతీర్థం




విజయనగరం జిల్లాలోని రామతీర్దంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామతీర్దంగా రాములవారి విగ్రహం ధ్వంసమైన ఘటనతో ప్రారంభమైన ఆందోళనలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. రెండు రోజుల క్రితం 'చలో రామతీర్థం' కార్యక్రమానికి బీజేపీ ఏపీ శాఖ పిలుపునిచ్చింది. అయితే అప్పుడు పోలీసులు అడ్డుకోవడంతో తాజాగా గురువారం బీజేపీ శ్రేణులు రామతీర్థానికి వెళ్లడానికి ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డితో పాటు భారీగా టీడీపీ కార్యకర్తలు రామతీర్థం ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు.

కాగా, రాయతీర్థంలో సెక్షన్ 30 అమలులో ఉండటంతో ఎవరినీ అనుమతించమని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఏ పార్టీకి చెందిన నాయకులనైనా ఇక్కడకు అనుమతించడం లేదని పోలీసులు చెప్పారు. దీంతో అక్కడ పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలో సోము వీర్రాజు సొమ్మసిల్లి కిందపడిపోయారు. దీంతో ఆందోళనకారులు మరింత తీవ్రంగా ప్రతిఘటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని.. దేవుడి ఆలయాన్ని సందర్శించేందుకు కూడా బీజేపీకి అవకాశం ఇవ్వట్లేదని ఆరోపించారు. అయితే విష్ణువర్దన్ రెడ్డిపి పోలీసులు మీడియాతో మాట్లాడనీయకుండా అరెస్టు చేసి ఆసపత్రికి తరలించారు. కాగా పోలీసులు తనపై దాడి చేశారని విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  ఫోన్ చేసి వివరించానని ఆయన చెప్పారు.


Latest News
more

Trending
more