Sekhar kammula Thriller Movie With Dhanush: ధనుష్ తో శేఖర్ కమ్ముల థ్రిల్లర్ మూవీ
ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న sekhar kammula శేఖర్ కమ్ముల ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ మూవీ ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్న ఆయన తన తర్వాత మూవీ గురించి ప్రకటించాడు. తమిళ స్టార్ dhanush ధనుష్ తో తాను తీయబోతున్న మూవీ థ్రిల్లర్ కథాంశంతో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదట్లో ప్రారంభవుతుందని స్పష్టం చేశారాయన. నిర్మాతలు పుష్కర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ లు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ మూవీ నిర్మిస్తున్నారు.
కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. naga chaitanya అక్కినేని నాగచైతన్య, sai pallavi సాయిపల్లవిలు హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈ మూవీలోనీ పాటలు సోషల్ మీడియాలో ఇప్పటికే దుమ్మురేపుతున్నాయి.