జానీ బెయిర్‌స్టో డక్ అవుట్లపై నెటిజన్ల జోకులు




ఇంగ్లాండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన బెయిర్‌స్టో మూడు సార్లు డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. ఇందులో రెండు సార్లు అశ్విన్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు.

బెయిర్‌స్టో టీమ్ ఇండియాతో ఆడిన గత 10 ఇన్నింగ్స్‌లలో మూడు సార్లు మాత్రమే డబుల్ ఫిగర్ అందుకున్నాడు. ఇందులో 28 పరుగులే అత్యధికం. ఇప్పటి వరకు టాప్ 7లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సార్లు డకౌట్ అయిన వాళ్లో బెయిర్ స్టో మూడవ స్థానంలో ఉన్నాడు. అజర్ అలీ 16 సార్లు, రాస్ టేలర్ 15 సార్లు డకౌట్ కాగా, బెయిర్ స్టో 13 సార్లు సున్నా పరుగులకే అవుటయ్యాడు.

మరోవైపు బెయిర్ స్టో పేలవ ఫామ్ కారణంగా టెస్టు జట్టు నుంచి తప్పించే ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరిచే బెయిర్ స్టో.. సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు. ఇక అతడి పేలవ ప్రదర్శనతో ఐపీఎల్‌లో సన్ రైజర్స్ జట్టు కూడా ఆందోళన చెందుతున్నది. ఆ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్‌గా బెయిర్ స్టో ఉన్నాడు.

 

Latest News
more

Trending
more